Harirama Jogaiah: కాపులను జగన్ కు తాకట్టు పెట్టారు.. ఉద్యమాన్ని గంగలో కలిపేశారు: ముద్రగడపై హరిరామజోగయ్య ఫైర్

Harirama Jogaiah fires on Mudragada Padmanabham
  • ముద్రగడపై ఉన్న సదభిప్రాయం పోయిందన్న హరిరామజోగయ్య
  • రాజకీయ లబ్ధి కోసమే కాపు ఉద్యమాన్ని నడిపారని విమర్శ
  • ద్వారంపూడికి ముద్రగడ మద్దతునివ్వడం సిగ్గుచేటని వ్యాఖ్య
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను విమర్శిస్తూ కాపు నేత ముద్రగడ పద్మనాభం రాసిన లేఖ ఏపీ రాజకీయాల్లోనే కాక, కాపు సామాజికవర్గంలో కూడా కలకలం రేపుతోంది. కాపు నేతలు రెండుగా విడిపోయి విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. కొందరు నేతలు ముద్రగడను సమర్థిస్తుండగా, మరికొందరు పవన్ కు మద్దతుగా మాట్లాడుతున్నారు. తాజాగా సీనియర్ రాజకీయవేత్త, కాపు సామాజికవర్గానికి చెందిన హరిరామజోగయ్య స్పందిస్తూ... ముద్రగడపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కు ముద్రగడ రాసిన లేఖపై మండిపడ్డారు. 

ఇంతకాలం ముద్రగడపై తనకున్న సదభిప్రాయం ఈ రోజుతో పోయిందని హరిరామజోగయ్య అన్నారు. పదవుల కోసం కాపు సామాజికవర్గాన్ని జగన్ కు తాకట్టు పెట్టేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ముద్రగడ కాపు ఉద్యమాన్ని నడిపారనే విషయం అర్థమయిందని చెప్పారు. కాపు ఉద్యమాన్ని గంగలో కలిపేశారని దుయ్యబట్టారు. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ముద్రగడ మద్దతునివ్వడం సిగ్గుచేటని అన్నారు. 

Harirama Jogaiah
Pawan Kalyan
Janasena
Mudragada Padmanabham
Jagan
YSRCP

More Telugu News