Sensex: చివరి గంటలో కొనుగోళ్ల జోరు.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 159 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 61 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ
  • 3 శాతానికి పైగా లాభపడ్డ టాటా మోటార్స్ షేరు విలువ
Markets ends in profits

నిన్న నష్టాలను చవిచూసిన స్టాక్ మార్కెట్లు ఈరోజు మళ్లీ లాభాల్లోకి మళ్లాయి. బలహీనంగా ఉన్న ఆసియా మార్కెట్ల ప్రభావంతోపాటు, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మన మార్కెట్లు కూడా భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే, ట్రేడింగ్ చివర్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో లాభాల్లోకి వెళ్లాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 159 పాయింట్లు లాభపడి 63,328కి చేరుకుంది. నిఫ్టీ 61 పాయింట్లు పుంజుకుని 18,817కి పెరిగింది. పవర్, ఆటో, ఐటీ, టెలికాం, టెక్ తదితర సూచీలు లాభాలను ఆర్జించగా.. ఫైనాన్స్, హెల్త్ కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ తదితర సూచీలు నష్టపోయాయి. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా మోటార్స్ (3.10%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.69%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.45%), టెక్ మహీంద్రా (1.28%), ఎన్టీపీసీ (1.00%). 

టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-1.86%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.18%), సన్ ఫార్మా (-0.96%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.51%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.41%).

More Telugu News