Andhra Pradesh: ప్రియుడితో వెళ్లిపోయిన భార్య.. ఆ ప్రియుడి ఫొటోకు చెప్పుల దండేసి ఊరేగించిన భర్త

Husband Vareity protest against for wife in madakasira anantapur
  • తన భార్యను ఎత్తుకెళ్లాడంటూ ఊరిలో చాటింపు
  • భార్య ప్రియుడి ఫొటోకు గ్రామస్థులతో చెప్పుదెబ్బలు
  • ఏపీలోని సత్యసాయి జిల్లాలో ఘటన
ప్రియుడిపై మోజుతో సంసారం వదిలేసి వెళ్లిన భార్యపై ఓ భర్త వినూత్నంగా నిరసన వ్యక్తం చేశాడు. భార్య ప్రియుడి ఫొటోకు చెప్పుల దండ వేసి ఊరేగించాడు. తన భార్యను ఎత్తుకు పోయాడంటూ ఊరిలో చాటింపు వేయించాడు. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిర మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

మండలంలోని క్యాంపురం గ్రామానికి చెందిన అంజి, నేత్రావతి దంపతులు.. ఇటీవల నేత్రావతి కనిపించకుండా పోయింది. దివాకర్ అనే వ్యక్తి తన భార్యకు మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్లాడంటూ అంజి ఆరోపిస్తున్నాడు. దీనికి నిరసనగా దివాకర్ ఫొటోకు చెప్పుల దండ వేసి సైకిల్ పై ఊరేగించాడు. తన భార్యను ఎత్తుకెళ్లాడంటూ ఊరంతా చాటింపు వేయించాడు. గ్రామస్థులతో దివాకర్ ఫొటోను చెప్పులతో కొట్టిస్తూ వీధివీధినా ఊరేగించాడు. అంజి ఆవేదనను అర్థం చేసుకున్న గ్రామస్థులు.. దివాకర్ ఫొటోపై ఉమ్ముతూ, చెప్పులతో కొడుతూ నిరసన తెలిపారు.
Andhra Pradesh
Anantapur District
wife elope
husband protest
wife lover photo

More Telugu News