పేరెంట్స్ క్లబ్ కు స్వాగతం: జూనియర్ ఎన్టీఆర్
- తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందిన రామ్ చరణ్, ఉపాసన
- శుభాకాంక్షలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్
- కూతురుతో గడిపే ప్రతి క్షణం మధురమైన జ్ఞాపకమేనన్న తారక్
రామ్ చరణ్, ఎన్టీఆర్ కుటుంబాల మధ్య ఎంతో ఆత్మీయమైన అనుబంధం ఉంది. ఇద్దరూ సొంత అన్నాదమ్ముళ్ల మాదిరే మెలుగుతుంటారు. ఎవరింట్లో ఫంక్షన్ జరిగినా వీరు కలుసుకుంటుంటారు. తాజాగా చరణ్ తండ్రి కావడంతో ఎన్టీఆర్ తన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ తెల్లవారుజామున ఉపాసన పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి కూడా ఆసుపత్రికి వెళ్లి తన మనవరాలిని చూసుకుని మురిసిపోయారు.