New Zealand: న్యూజిలాండ్‌లోని చైనా రెస్టారెంట్లపై గొడ్డలితో దుండగుడి దాడి.. నలుగురికి గాయాలు

  • న్యూజిలాండ్ ఆక్లాండ్‌లో ఘటన
  • మూడు రెస్టారెంట్లలో దాడికి దిగిన దుండగుడు
  • 24 ఏళ్ల నిందితుడి అరెస్ట్
Man Attacked Chinese Restaurants In New Zealand With Axe

న్యూజిలాండ్‌లోని చైనీస్ రెస్టారెంట్లలో భోజనం చేస్తున్న వారిపై ఓ వ్యక్తి గొడ్డలితో దాడిచేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. న్యూజిలాండ్‌లోని అతిపెద్ద నగరమైన ఆక్లాండ్‌లో జరిగిందీ ఘటన. దుండగుడి దాడిలో గాయపడిన నలుగురిలో ఒకరు డిశ్చార్జ్ కాగా, చికిత్స పొందుతున్న ముగ్గురి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. 

గత రాత్రి 9 గంటల సమయంలో మూడు చైనీస్ రెస్టారెంట్లలోకి ప్రవేశించిన దుండగుడు అక్కడ డిన్నర్ చేస్తున్న వారిపై గొడ్డలితో దాడికి దిగాడు. దీంతో రెస్టారెంట్లలోని జనం భయంతో పరుగులు తీశారు. తాను ఓ రెస్టారెంట్‌లో తన ఫ్రెండ్‌తో కలిసి డిన్నర్ చేస్తున్నప్పుడు ఓ వ్యక్తి గొడ్డలితో తన వద్దకు వచ్చినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. 

అతడిని చూసిన ప్రతి ఒక్కరు వెంటనే నిలబడి ‘ఏం చెయ్యబోతున్నావ్?’ అంటూ భయంతో పెద్దగా అరిచారని పేర్కొన్నారు. ఆ వెంటనే అతడు తన ఫ్రెండ్‌పై మళ్లీ దాడిచేశాడని చెప్పారు. ఈ ఘటన తర్వాత పోలీసులు 24 ఏళ్ల నిందితుడిని అరెస్ట్ చేశారు.

More Telugu News