Nara Lokesh: పేదల ఇళ్లలో ఒక బిడ్డే చదవాలని జగన్ అనడం దుర్మార్గం: నారా లోకేశ్

Lokesh Yuvagalam Padayatra in Venkatagiri constituency
  • వెంకటగిరి నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర
  • ఆకిలివలస గ్రామంలో రచ్చబండ
  • మేనిఫెస్టోపై అవగాహన కల్పించిన లోకేశ్  
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 131వ రోజు వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో హోరెత్తింది. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల ప్రజలు అడుగడుగునా యువనేతకు ఆత్మీయ స్వాగతం పలుకుతూ తమ సమస్యలు చెప్పుకున్నారు. యువనేత మరో ఏడాదిలో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి సమస్యలకు పరిష్కారం చూపుతుందని చెప్పి ముందుకు సాగారు. 

పబ్లిసిటీపై తప్ప పనులపై శ్రద్ధ ఏది జగన్?

అకిలవలసలో గత ప్రభుత్వంలో ఏర్పాటుచేసిన సోలార్ పంప్ సెట్ వద్ద సెల్ఫీ దిగిన లోకేశ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇది వెంకటగిరి నియోజకర్గం అకిలవలసలో ఎన్టీఆర్ జలసిరి పథకం కింద గత టీడీపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన సోలార్ పంపు సెట్ అని వెల్లడించారు. 

"బీళ్లుగా మారిన పేదల భూముల్లో సాగునీటి వసతిని కల్పించేందుకు సోలార్ పంపుసెట్లను ఏర్పాటు చేసే ఎన్టీఆర్ జలసిరి కార్యక్రమాన్ని గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద రూ.55 వేల విలువైన సోలార్ పంపు సెట్ ను సాధారణ రైతుల కైతే రూ.25 వేలకు, ఎస్సీ, ఎస్టీలకు రూ.6 వేలకే అందించాం. దీనిని స్టిక్కర్ సీఎం జగన్... వైఎస్సార్ జలకళగా మార్చాడు. 

నియోజకవర్గానికి 500 బోర్లు వేయిస్తానని చెప్పి, 50 నెలల్లో ఒక్క బోరు వేసిన దాఖలాలు కూడా లేవు. ముఖ్యమంత్రి జగన్ కు పబ్లిసిటీ పీక్... మ్యాటర్ వీక్ అనడానికి ఇంతకంటే ఏం నిదర్శనం కావాలి" అంటూ లోకేశ్ దుయ్యబట్టారు.

మాతమ్మ గుడిలో లోకేశ్ పూజలు

రాష్ట్రంలో జగన్ అరాచక పాలనలో బాధితులుగా మారిన కోట్లాది ప్రజల బాధలు పోవాలంటే బాబు రావాల్సిందేనని యువనేత నారా లోకేశ్ పేర్కొన్నారు. వెంకటగిరి నియోజకవర్గం ఆకిలవలస గ్రామంలో మాతమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేసిన యువనేత అనంతరం దళితవాడలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లోకేశ్ మాట్లాడుతూ... ఒక్క ఛాన్స్ మాయలో పడి పాలిచ్చే ఆవుని వద్దని తన్నే దున్నపోతును తెచ్చుకున్నారని విచారం వ్యక్తం చేశారు. 

"రూ.200 పెన్షన్ ని రూ.2000 వేలు చేసిన ఘనత చంద్రబాబు గారిది. ఇప్పుడు జగన్ రూ.750 పెంచడానికి నాలుగేళ్లు పట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల పెన్షన్లు కట్ చేశాడు. మరో 6 లక్షల పెన్షన్లు కట్ చెయ్యడానికి జగన్ ప్లాన్ చేశాడు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ తీసేసిన 6 లక్షల పెన్షన్లు మళ్ళీ ఇస్తాం. 

ఎన్నికల ముందు అమ్మ ఒడి ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి ఇస్తానని జగన్ మోసం చేసాడు. పేదల ఇళ్లల్లో ఒక బిడ్డే చదవాలి అని జగన్ అనడం దుర్మార్గం. అందుకే టీడీపీ తల్లికి వందనం పేరుతో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నాం. ముగ్గురు బిడ్డలు ఉంటే ఒకొక్కరికి రూ.15 వేలు చొప్పున ముగ్గురికి రూ.45 వేలు అందిస్తాం.

విద్యా దీవెన, వసతి దీవెన చెత్త కార్యక్రమాలు. దీని వలన తల్లిదండ్రులు, విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురి అవుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పాత ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని అమలు చేసి డైరెక్ట్ గా ఫీజులు కాలేజీకి చెల్లిస్తాం" అని వివరించారు.

మహిళలను ఆదుకునేందుకే మహిళాశక్తి!

నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కరెంట్ బిల్లులు విపరీతంగా పెరిగిపోయాయి, ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచారు, గ్యాస్ ధర విపరీతంగా పెరిగిపోయింది. అందుకే మహిళల కోసం మహిళా శక్తి పేరుతో సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించాం. 

ఆడ బిడ్డ నిధి కింద 18 ఏళ్లు దాటిన అందరికీ నెలకి రూ.1500 ఇస్తాం. ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పన్నులు తగ్గించి నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తాం. 


సీనియర్ నేత కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ...

టీడీపీ హయంలోనే ఎస్సీలకు న్యాయం జరిగిందని సీనియర్ నేత కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. ఎస్సీల కోసం ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ కార్యక్రమాలను జగన్ రద్దు చేశాడని ఆరోపించారు. వైసీపీ పాలనలో సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితి దారుణంగా తయారైందని అన్నారు. అందరి సమస్యలు పరిష్కారం కావాలంటే చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిని చేయాలని కోరారు.

*యువగళం పాదయాత్ర వివరాలు*

*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 1686.8 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 16.4 కి.మీ.*

*132వ రోజు పాదయాత్ర వివరాలు (20-6-2023):*

*వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం (తిరుపతి జిల్లా):*

సాయంత్రం

4.00 – రాపూరు శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

4.30 – రాపూరు ఎస్టీ కాలనీ వాసులతో సమావేశం.

4.40 – రాపూరు జంక్షన్ లో స్థానికులతో మాటామంతీ.

5.25 – మద్దిలమడుగు జంక్షన్ లో స్థానికులతో సమావేశం.

6.10 – సిద్దవరంలో స్థానికులతో సమావేశం.

7.10 – మాదావాయపాలెంలో స్థానికులతో సమావేశం.

7.40 – వెలికల్లులో స్థానికులతో మాటామంతీ.

7.50 – వెలికల్లు దళితవాడలో రైతులతో సమావేశం.

8.10 – మర్లగుంటలో స్థానికులతో మాటామంతీ.

8.30 – డక్కిలి రాజన్న ఫ్యామిలీ డాబా వద్ద తటస్థ ప్రముఖులతో డిన్నర్ మీట్.

9.55 – డక్కిలిలో పాదయాత్ర 1700 కి.మీ. చేరిక, శిలాఫలకం ఆవిష్కరణ.

10.05 – డక్కిలి శివారు విడిది కేంద్రంలో బస.

******


Nara Lokesh
Yuva Galam Padayatra
Venkatagiri
Nellore District
TDP

More Telugu News