da: తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 2.73 శాతం డీఏ మంజూరు

  • ఉద్యోగుల మూల వేతనం, పెన్షన్‌పై ఈ మేరకు డీఏ పెరుగుదల 
  • పెంచిన డీఏ 2022 జనవరి నుండి అమల్లోకి
  • 7.28 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి
Good news for Telangana government employees

ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఒక డీఏను విడుదల చేసింది. డీఏను విడుదల చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఉద్యోగుల మూల వేతనం, పెన్షన్‌పై 2.73 శాతం డీఏ పెరగనుంది. ఉద్యోగుల డీఏను పెంచుతూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ నెల నుండి డీఏను పెంచింది. పెంచిన డీఏ 2022 జనవరి నుంచి అమలు కానుంది.

తాజా పెరుగుదలతో 7.28 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి కలుగనుంది. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా డీఏ మంజూరు చేసినట్లు హరీశ్ రావు తెలిపారు. డీఏ పెంపుతో ప్రభుత్వంపై ఏడాదికి రూ.974.16 కోట్ల అదనపు భారం పడుతుంది. నెలకు రూ.81.18 కోట్ల భారం పడుతుంది. పెంచిన డీఏ ప్రకారం రూ.1380 కోట్ల ఎరియర్స్ చెల్లించనున్నట్లు మంత్రి తెలిపారు.

More Telugu News