kedarnath temple: కేదార్‌నాథ్ ఆలయంలో అపచారం.. శివలింగంపై నోట్లు చల్లిన మహిళ

  • శివలింగానికి పక్కన నిలబడి నోట్లు వెదజల్లుతున్నట్లు వీడియో
  • ఆమె ప్రవర్తనపై, ఆలయ సిబ్బంది, అధికారులపై విమర్శలు
  • రాతపూర్వకంగా ఫిర్యాదు చేసిన ఆలయ కమిటీ అధ్యక్షుడు
Woman blows money at Kedarnath sanctum sanctorum

కేదార్ నాథ్ ఆలయం గర్భగుడిలో అపచారం జరిగింది. శివలింగంపై ఓ మహిళ కరెన్సీ నోట్లు చల్లడం వివాదాస్పదంగా మారింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో సదరు మహిళపై చర్యలు తీసుకోవాలని ఆలయ కమిటీ పోలీసులను కోరింది. అయితే ఆమె ఎవరో తెలియరాలేదు.

ఈ వీడియోను పరిశీలించగా శివలింగానికి పక్కన కుడివైపున నిలబడిన మహిళ కేదారేశ్వరుడిపై నోట్లు వెదజల్లుతోంది. అదే సమయంలో పురోహితులు మంత్రాలు పఠిస్తున్నారు. ఈ గుడిలో ఫోటోలు, వీడియోలు తీయడం నిషిద్ధం. పైగా ఆమె కరెన్సీ నోట్లు చల్లుతుంటే ఎవరూ వారించలేదు. దీంతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆలయంలో ఆమె ప్రవర్తనపై, ఆలయ సిబ్బంది, అధికారులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రుద్రప్రయాగ్ జిల్లా కలెక్టర్, ఎస్పీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు బద్రీనాథ్ - కేదార్ నాథ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్ చెప్పారు. ఇందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.

More Telugu News