Raviteja: మరోసారి రవితేజతో మాస్ జోడీ కడుతున్న శ్రీలీల!

  • రవితేజ 'ధమాకా'తో హిట్ కొట్టిన శ్రీలీల
  • డాన్స్ పరంగా దక్కిన మరిన్ని మార్కులు 
  • చేతిలో ఇప్పుడు అరడజనుకి పైగా సినిమాలు 
  • రవితేజ సినిమా కోసం మళ్లీ ఆమెనే ఎంపికైనట్టు టాక్
Sreeleela in Raviteja movie

టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా శ్రీలీల పేరే కనిపిస్తోంది. వరుస సినిమాలతో ఈ బ్యూటీ దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆమె బాలకృష్ణ .. పవన్ కల్యాణ్ .. మహేశ్ బాబు .. నితిన్ .. రామ్ .. విజయ్ దేవరకొండ .. వైష్ణవ్ తేజ్ .. నవీన్ పోలిశెట్టి సినిమాలతో బిజీగా ఉంది. ఈ జాబితాలో బాలకృష్ణ సినిమాలో మాత్రం ఆయన కూతురిగా కనిపించనుంది.

ఇక ఈ సినిమాల కంటే ముందు శ్రీలీల చేసిన సినిమా .. అవకాశాలు ఆమెకి ఈ రేంజ్ లో వచ్చి పడటానికి కారణం .. 'ధమాకా'. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఆమె చేసిన ఈ సినిమా, కథాకథనాల పరంగా .. మ్యూజికల్ హిట్ గాను నిలిచింది. శ్రీలీల డాన్సులు కూడా ఇరగదీస్తుందనే పేరు తెచ్చుకుంది. 

ఈ నేపథ్యంలోనే మరోసారి ఆమె రవితేజ సరసన నటించనున్నట్టుగా తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు .. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా ఒక సినిమా చేయనున్నారు. ఈ సినిమా కోసమే శ్రీలీలను ఎంపిక చేసినట్టుగా చెబుతున్నారు. అదే నిజమైతే మరోసారి మాస్ మహారాజ్ అభిమానులకు పండగే. 

More Telugu News