Adipurush: 'ఆదిపురుష్' ఎఫెక్ట్.. అన్ని హిందీ సినిమాలపై నిషేధం విధించిన నేపాల్ లోని రెండు నగరాలు

  • 'ఆదిపురుష్' సినిమాపై నేపాల్ లో వ్యతిరేకత
  • సీత ఇండియాలో పుట్టిందనే డైలాగ్ పై ఆగ్రహం
  • ఖాట్మండూ, పోఖారాలో హిందీ సినిమాలపై బ్యాన్
Two cities in Nepal bans Hindi movies due to Adipurush movies issue

ఓవైపు భారీ కలెక్షన్లను సాధిస్తున్న 'ఆదిపురుష్' చిత్రం.. మరోవైపు తీవ్ర విమర్శలను మూటకట్టుకుంది. రామాయణం కథను వక్రీకరించారంటూ దర్శక నిర్మాతలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేపాల్ లో కూడా ఈ చిత్రంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. సీతాదేవిని భారతదేశ బిడ్డగా చూపించడాన్ని నేపాలీలు సహించలేకపోతున్నారు. సీత పుట్టింది నేపాల్ లో అని వారు వాదిస్తున్నారు.  

ఈ క్రమంలో ఈ సినిమాను తొలి షో నుంచే ఆ దేశ రాజధాని ఖాట్మండూతో పాటు కొన్ని ప్రాంతాల్లో నిషేధించారు. ఈ డైలాగ్ ను మార్చకపోతే హిందీ సినిమాలను కూడా బ్యాన్ చేస్తామని హెచ్చరించారు. చెప్పినట్టుగానే అక్కడ హిందీ చిత్రాలపై బ్యాన్ విధించారు. ఖాట్మండూతో పాటు టూరిస్ట్ టౌన్ అయిన పోఖారాలో హిందీ సినిమాలను నిషేధించారు. 

నేపాల్ మేయర్ బలేంద్ర షా మాట్లాడుతూ, ఈ డైలాగ్ వల్ల ఎంతో నష్టం జరుగుతుందని చెప్పారు. ఈరోజు నుంచి నగరంలో హిందీ సినిమాలను ప్రదర్శించనివ్వబోమని తెలిపారు.

More Telugu News