Prabhas: టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న 'ఆదిపురుష్'.. ఎన్ని వందల కోట్లు వసూలు చేసిందంటే..!

  • తొలి మూడు రోజుల్లో భారీ వసూళ్లు రాబట్టిన 'ఆదిపురుష్'
  • నెగెటివ్ టాక్ మధ్యే రూ. 305 కోట్ల వసూళ్లు
  • తొలి రోజు ఏకంగా రూ. 140 కోట్ల కలెక్షన్స్
Adipurush Collections

ప్రభాస్ తాజా చిత్రం 'ఆదిపురుష్'కు నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ... బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. భారీ అంచనాల మధ్య గత శుక్రవారం (ఈనెల 16) విడుదలైన ఈ చిత్రంపై తొలి షో నుంచే పలువురు పెదవి విరిచారు. రామాయణం కథను కొన్ని చోట్ల మార్చేశారని, డైలాగులు సరిగా లేవని, గ్రాఫిక్స్ దారుణంగా ఉన్నాయని ఇలా ఎన్నో నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. రివ్యూలు సైతం దారుణంగా వచ్చాయి. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సునామీని సృష్టించింది. దేశ వ్యాప్తంగా థియేటర్లన్నీ కిక్కిరిసిపోయాయి. తొలి మూడు రోజుల్లో (ఆదివారం వరకు) ప్రపంచ వ్యాప్తంగా రూ 300 కోట్లకు పైగా గ్రాస్ ను కలెక్ట్ చేసి భారీ ఓపెనింగ్స్ ను సాధించింది. 

ఆదిపురుష్ వసూళ్లు: 

  • తొలి రోజు (శుక్రవారం) - రూ. 140 కోట్లు
  • రెండో రోజు (శనివారం) - రూ. 100 కోట్లు
  • మూడో రోజు (ఆదివారం) - రూ. 65 కోట్లు
  • తొలి మూడు రోజుల కలెక్షన్లు - రూ. 305 కోట్లు

ఈ చిత్రంలో ప్రభాస్ సరసన సీత పాత్రలో కృతి సనన్ నటించారు. సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రను పోషించారు. మరోవైపు ఈ చిత్రం తొలి వారంలో భారీ వసూళ్లను సాధించడంలో నిర్మాణ సంస్థ టీసిరీస్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. 'జై శ్రీరామ్' అని ట్వీట్ చేసింది.

More Telugu News