Uttar Pradesh: చిరుత పిల్లతో బాలుడి ఆటలు.. వీడియో ఇదిగో!

Boy playing with a leopard cub in uttar pradesh meerut video is going viral
  • యూపీలోని ఓ మామిడి తోటలో ఘటన
  • మొబైల్ లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్
  • వైరల్ గా మారిన వీడియోపై అధికారులకు ఫిర్యాదు
  • చిరుత పిల్లను స్వాధీనం చేసుకున్న అటవీ శాఖ సిబ్బంది

అడవుల నరికివేత వల్లో, వాతావరణ మార్పుల వల్లో.. కారణం ఏదైనా అప్పుడప్పుడూ అడవి జంతువులు జనారణ్యంలోకి వస్తుంటాయి. జనసంచారం పెద్దగా లేని సమయాల్లో ఇండ్లల్లోకి చొరబడిన సంఘటనలూ చోటుచేసుకున్నాయి. ఇలాగే ఊరు బయట ఉన్న ఓ మామిడితోటలోకి వచ్చిన చిరుత పిల్లను కొంతమంది తాడుతో కట్టేశారు. ఓ చిన్న పిల్లాడు దానితో ఆటలాడాడు. పక్కనే ఉన్న వారిలో ఒకరు ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. యూపీలోని మీరట్ లో ఇది చోటుచేసుకుంది.

మీరట్ లోని షాజన్ పూర్ లోని ఓ మామిడి తోటలో చిరుత పిల్లతో ఓ బాలుడు ఆటలాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెంపుడు కుక్కతో ఆడుకుంటున్నట్లు చిరుత పిల్లతో ఆడుకోవడం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ ఘటనపై మామిడితోట యజమాని ఫిర్యాదు చేయడంతో అటవీ శాఖ అధికారులు స్పందించారు. వెంటనే సిబ్బందిని పంపించి చిరుత పిల్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ బాలుడితో పాటు అక్కడ ఉన్న మిగతా వారినీ ప్రశ్నించారు. దీనిపై మరింత విచారణ జరుపుతామని, చట్టప్రకారం నిందితులపై చర్యలు తీసుకుంటామని అధికారులు వివరించారు.

  • Loading...

More Telugu News