UK: బ్రిటన్‌లో ఖలిస్థానీ ఉగ్రవాది కాల్చివేత
- కాల్పుల్లో ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ అదినేత హర్‌దీప్ సింగ్ నిజ్జార్ మృతి
- నిజ్జార్‌ను గతంలోనే ఉగ్రవాదిగా ప్రకటించిన భారత్
- పంజాబ్‌లో ఓ హిందూ పూజారీ హత్యకు కుట్రపన్నిన నిజ్జార్
- అతడి ఆచూకీ చెప్పిన వారికి రూ.10 లక్షల రివార్డు ప్రకటించిన ఎన్ఐఏ
బ్రిటన్‌లో తాజాగా జరిగిన కాల్పుల్లో ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జార్ మరణించాడు. పలు భారత వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్న నిజ్జార్‌ను కేంద్ర ప్రభుత్వం గతంలోనే ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన 40 మంది ఉగ్రవాదుల జాబితాలోనూ నిజ్జార్ ఉన్నాడు. పంజాబ్‌లో ఓ హిందూ అర్చకుడి హత్యకు కుట్ర పన్నిన నిజ్జార్ ఆచూకీ కోసం 2022లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) రూ.10 లక్షల రివార్డు ప్రకటించింది. నిజ్జర్ కెనడాలో ఉంటాడు. అతడి ఆధ్వర్యంలోని ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ పంజాబ్ అర్చకుడి హత్యకు కుట్ర పన్నింది.