Ajinkya Rahane: మళ్లీ కౌంటీలకు రహానే.. విండీస్‌తో టెస్టు సిరీస్ ముగిసిన వెంటనే ఇంగ్లండ్‌కు!

Team India Batter Ajinkya Rahane To Play For Leicestershire
  • లీసెస్టర్‌షైర్‌ తరపున ఆడనున్న రహనే
  • విండీస్‌తో టెస్టు సిరీస్ ముగిసిన వెంటనే ఇంగ్లండ్ పయనం
  • రాయల్ లండన్‌కప్‌లో లీసెస్టర్‌షైర్‌కు ప్రాతినిధ్యం
టీమిండియా సీనియర్ మిడిలార్డర్ బ్యాటర్ అజింక్య రహానే మళ్లీ కౌంటీల బాటపట్టాడు. ఇంగ్లిష్ కౌంటీలో లీసెస్టర్‌షైర్ తరపున ఆడనున్నాడు. వచ్చే నెలలో వెస్టిండీస్‌లో పర్యటించనున్న భారత జట్టు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడుతుంది. ఆ సిరీస్ ముగిసిన వెంటనే రహానే ఇంగ్లండ్‌కు పయనమవుతాడు. విండీస్‌తో జులై 24తో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత రహానే అక్కడి నుంచి నేరుగా ఇంగ్లండ్ వెళ్లి లీసెస్టర్‌షైర్‌తో చేరుతాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో వరుసగా 89, 46 పరుగులు చేసిన రహానే పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. లీసెస్టర్‌షైర్‌తో జనవరిలోనే ఒప్పందం కుదుర్చుకున్న రహానే ఇందులో భాగంగా జూన్-సెప్టెంబరు మధ్య 8 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లతోపాటు రాయల్ లండన్ కప్ (దేశవాళీ 50 ఓవర్ల టోర్నీ)లో ఆడాల్సి ఉండగా డబ్ల్యూటీ ఫైనల్ కారణంగా ఐపీఎల్ ముగిసిన వెంటనే భారత జట్టులో చేరాల్సి వచ్చింది.
Ajinkya Rahane
Team India
Leicestershire
England County

More Telugu News