Pawan Kalyan: 6వ రోజుకు చేరుకున్న పవన్ వారాహి యాత్ర.. ఈరోజు షెడ్యూల్ ఇదే!

Pawan Kalyan Varahi yatra schedule
  • జగన్, వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేస్తున్న పవన్
  • ఈరోజు కాకినాడ రూరల్ ప్రాంతంలో కొనసాగనున్న యాత్ర
  • ఏటిమొగ ప్రాంతంలో ఫీల్డ్ విజిట్
వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే ఏకైక లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర 6వ రోజుకు చేరుకుంది. తన యాత్ర సందర్భంగా ముఖ్యమంత్రి జగన్, వైసీపీ ప్రజాప్రతినిధులపై ఆయన తీవ్ర విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చనివ్వనని చెపుతున్నారు. వైసీపీని ఓడించడానికి ఎన్ని వ్యూహాలైనా అమలు చేస్తామని అంటున్నారు. మరోవైపు ఈనాటి వారాహి యాత్ర కాకినాడ రూరల్ పరిధిలో కొనసాగనుంది. 

నేటి పవన్ వారాహి యాత్ర షెడ్యూల్ ఇదే:
  • ఉదయం 11 గంటలకు : కాకినాడ రూరల్ పరిధిలోని ప్రముఖులతో భేటీ 
  • మధ్యాహ్నం 12 గంటలకు : వీర మహిళలతో సమావేశం 
  • సాయంత్రం 5 గంటలకు : ఏటిమొగ ప్రాంతంలో ఫీల్డ్ విజిట్.
Pawan Kalyan
Janasena
Varahi Yatra

More Telugu News