Chidvilas Reddy: తన విజయ రహస్యం చెప్పిన జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫస్ట్ ర్యాంకర్ చిద్విలాస్

  • రోజుకు 10 నుంచి 12 గంటలపాటు చదివినట్టు చెప్పిన చిద్విలాస్
  • సోషల్ మీడియాకు దూరంగా ఉన్నట్టు వెల్లడి
  • ప్రణాళిక ప్రకారం చదివానన్న చిద్విలాస్
JEE All India First Ranker Chidvilas reddy Reveals His Success Mantra

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో ఆలిండియా ఫస్ట్ ర్యాంకర్ వావిలాల చిద్విలాస్‌రెడ్డి తన విజయ రహస్యాన్ని వెల్లడించాడు. నాగర్ కర్నూలుకు చెందిన చిద్విలాస్‌రెడ్డి హైదరాబాద్ హస్తినాపురంలో చదువుకున్నాడు. తల్లిదండ్రులు నాగలక్ష్మి, రాజేశ్వర్‌రెడ్డి ఇద్దరూ టీచర్లే. తాను 9వ తరగతి నుంచే జేఈఈకి సన్నద్ధమైనట్టు చెప్పిన చిద్విలాస్.. సోషల్ మీడియాకు దూరంగా ఉండడమే తన విజయ రహస్యమని చెప్పుకొచ్చాడు. 

మొబైల్‌ఫోన్‌కు దూరంగా ఉన్నానని, రోజూ 10 నుంచి 12 గంటలపాటు చదివేవాడినని తెలిపాడు. ఐఐటీ ముంబైలో సీఎస్ఈ కోర్సులో చేరి రీసెర్చ్ రంగంలో రాణిస్తానని పేర్కొన్నాడు. జేఈఈకి ఒక ప్రణాళిక ప్రకారం చదివానని, రోజులో రెండు గంటలపాటు మ్యాథ్స్, మూడు గంటలు ఫిజిక్స్‌కు కేటాయించేవాడినని వివరించాడు. సబ్జెక్టుకు సబ్జెక్టు మధ్య అరగంటపాటు విశ్రాంతి తీసుకునేవాడినని చెప్పాడు. నెగటివ్ మార్కులు ఉండడంతో కాన్ఫిడెంట్‌గా ఉన్న ప్రశ్నలకే సమాధానాలు రాసినట్టు వివరించాడు.

More Telugu News