Halfday Schools: ఏపీలో ఒంటిపూట బడులు పొడిగింపు... ఎప్పటివరకు అంటే...!

  • జూన్ 12న ఏపీలో స్కూళ్ల పునఃప్రారంభం
  • జూన్ 17 వరకు ఒంటిపూట బడులు
  • ఇంకా తగ్గని ఎండలు
  • ఈ నెల 24 వరకు ఒంటిపూట బడుల పొడిగింపు
  • ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
Half day schools extended in AP

రోహిణి కార్తె పోయింది... మృగశిర వచ్చినా ఎండలు తగ్గలేదు సరికదా వడగాడ్పులు మరింత విజృంభిస్తూ ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఒంటిపూట బడులు మరో వారం పొడిగించింది. ఈ నెల 24 వరకు ఒంటిపూట బడులు కొనసాగుతాయని ఏపీ పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. 

జూన్ 12న రాష్ట్రంలో పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటికీ, ఎండలను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 17 వరకు ఒంటిపూట బడులు జరపాలని నిర్ణయించారు. ఇప్పటికీ ఎండలు తగ్గకపోవడంతో తాజాగా పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు. 

ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. ఇది అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు వర్తిస్తుందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

More Telugu News