Mahesh Babu: తండ్రీకొడుకులా లేరు... మహేశ్ బాబు, గౌతమ్ ల ఫొటో పంచుకున్న నమ్రతా

Namrata Shirodkar wishes Mahesh Babu on Fathers Day
  • ఇవాళ ఫాదర్స్ డే
  • మహేశ్ బాబుకు విషెస్ తెలిపిన నమ్రతా
  • కుమారుడు గౌతమ్ తో పోటీపడుతూ యంగ్ లుక్ లో మహేశ్
  • ఏ కాలేజ్ బ్రో మీది అంటూ నెటిజన్ల వ్యాఖ్యలు

ఇవాళ అంతర్జాతీయ ఫాదర్స్ డే సందర్భంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు అర్ధాంగి నమ్రతా శిరోద్కర్ ఆసక్తికర ఫొటో పంచుకున్నారు. ఆ ఫొటోలో మహేశ్ బాబు, ఆయన తనయుడు గౌతమ్ ఉన్నారు. 

గౌతమ్ ప్రస్తుతం నూనూగు మీసాల టీనేజ్ ప్రాయంలో ఉండగా, మహేశ్ బాబు సైతం కుర్ర లుక్ తో అదరగొడుతున్నాడు. అంతర్జాతీయ ఫ్యాషన్ బ్రాండ్ గుస్సీ స్టోర్ ను మహేశ్, గౌతమ్ సందర్శించినప్పటికీ ఫొటో అది. ఆ పిక్ చూస్తే తండ్రీకొడుకు అంటే ఎవరూ నమ్మేలా లేదు. బ్రదర్స్, ఫ్రెండ్స్... ఇలాగైతే నమ్మేస్తాం అని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఏ కాలేజి బ్రో మీది అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించగా... అన్నదమ్ముల్లా ఉన్నారని మరో నెటిజన్ పేర్కొన్నారు. 

ఇక, ఈ పిక్ పై నమ్రతా శిరోద్కర్ కామెంట్ చేశారు. "హ్యాపీ ఫాదర్స్ డే ఎంబీ (మహేశ్ బాబు). నీతో ఉన్నప్పుడు నిరుత్సాహంగా గడిచిన క్షణం ఒక్కటి కూడా లేదు. వుయ్ లవ్యూ" అంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు.

  • Loading...

More Telugu News