JD Chakraborty: విష్ణు ప్రియతో నాది గురు శిష్యుల బంధమే.. ఆమె నన్ను ప్రేమించడం లేదు: జేడీ చక్రవర్తి

JD Chakraborty clears rumors of love and marriage with anchor Vishnupriya
  • ఓ వెబ్ సిరీస్ లో నటించిన విష్ణుప్రియ, జేడీ
  • జేడీని  ప్రేమిస్తున్నా, వాళ్ల అమ్మ ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానన్న విష్ణుప్రియ
  • తన చిత్రాల్లోని పాత్రలతో విష్ణుప్రియ ప్రేమలో పడిందన్న జేడీ  
యాంకర్ విష్ణుప్రియతో ప్రేమ, పెళ్లి వార్తలపై సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి స్పందించాడు. అవన్నీ పుకార్లే అని అన్నాడు. తమ మధ్య మంచి అనుబంధం ఉందని, అది ప్రేమకాదని చెప్పారు. విష్ణుప్రియ, జేడీ ఇటీవల ఓ వెబ్ సిరీస్ లో కలిసి నటించారు. దాంతో, ఇద్దరు మంచి స్నేహితలయ్యారు. ఈ క్రమంలో తాను జేడీ చక్రవర్తిని ఇష్టపడుతున్నానని, వాళ్ల అమ్మ అంగీకరిస్తే ఆయన్ని వివాహం చేసుకుంటానంటూ ఇటీవల విష్ణుప్రియ చేసిన కామెంట్లు సంచలనం అయ్యాయి.

వెబ్ సిరీస్ కోసం విష్ణుప్రియతో దాదాపు 40 రోజులు కలిసి వర్క్ చేశానని జేడీ వెల్లడించాడు. ‘ఆ సమయంలో ప్రతిరోజూ నేను నటించిన ఒక సినిమా చూడమని విష్ణుప్రియకు ఆ దర్శకుడు చెప్పాడు. అలా, నేను నటించిన సినిమాలన్నీ చూసి ఆయా చిత్రాల్లోని పాత్రలతో ఆమె ప్రేమలో పడింది తప్ప ఆమె నన్ను ప్రేమించలేదు. మా మధ్య గురు శిష్యుల అనుబంధమే ఉంది’ అని జేడీ స్పష్టం చేశాడు.
JD Chakraborty
anchor Vishnupriya
marriage
news

More Telugu News