USA: మోదీ అమెరికా పర్యటన ముంగిట భారత టెకీలకు శుభవార్త

  • ఈ నెల 21 నుంచి 24 వరకు మోదీ అమెరికా పర్యటన
  • గ్రీన్ కార్డు నిబంధనలను సడలించిన అగ్రరాజ్యం
  • 1.4 లక్షల మందికి లభించనున్న గ్రీన్ కార్డు
USA changes Green Card Eligibility Norms

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ దంపతుల ఆహ్వానం మేరకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 21 నుంచి 24 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన ముంగిట అగ్రరాజ్యంలో గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న ఐటీ ఉద్యోగులు, భారతీయులకు అమెరికా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రీన్ కార్డు అర్హత నిబంధనలను బైడెన్‌ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం సడలించింది. 

ఈ నేపథ్యంలో గ్రీన్‌కార్డు అర్హత నిబంధనలను అమెరికా సడలించడం గమనార్హం. గ్రీన్‌కార్డు ద్వారా వలసదారులకు అమెరికాలో శాశ్వత నివాసానికి అనుమతి లభిస్తుంది. వలసల చట్టం ప్రకారం ఏటా సుమారు 1.4 లక్షల గ్రీన్‌కార్డులను అమెరికా జారీ చేస్తోంది. ఏదైనా ఒక దేశానికి చెందిన వ్యక్తులకు వాటిలో 7 శాతం మాత్రమే లభిస్తున్నాయి.

More Telugu News