Sharad Pawar: బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్: శరద్ పవార్ విమర్శలు

  • దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా విస్తరించుకునే హక్కు పార్టీలకు ఉందన్న పవార్ 
  • మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీలనే కేసీఆర్ టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తోందని వ్యాఖ్య
  • ఇది బీజేపీ ప్లాన్‌లో భాగమనే అనుమానం తమకు ఉందని వెల్లడి
Sharad Pawar calls BRS is B team of BJP

బీఆర్ఎస్ పై నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అని ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. మహారాష్ట్రలో కేవలం కాంగ్రెస్, ఎన్సీపీలను మాత్రమే టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తోందని మండిపడ్డారు. ఇది రాష్ట్రంలోని అధికార పార్టీ ప్లాన్‌లో భాగమనే అనుమానం తమకు ఉందని అన్నారు.

ప్రకాశ్ అంబేద్కర్ పార్టీ ‘వంచిత్ బహుజన్ అఘాడీ’ వల్ల 2019 ఎన్నికల్లో కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి దెబ్బతిందని అన్నారు. ‘‘దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా.. ఏ రాష్ట్రంలోనైనా తమ పార్టీని విస్తరించుకునే హక్కు ఉంది. కానీ బీఆర్ఎస్.. బీజేపీకి చెందిన ‘బీ’ టీమ్‌ అనిపిస్తోంది’’ అని అన్నారు. 

మహారాష్ట్ర రాజకీయాలపై ఇటీవల కేసీఆర్ దృష్టిపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు బహిరంగ సభలు నిర్వహించిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో అక్కడ పోటీ చేస్తామని ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే ఐదేళ్లలో కుళాయిల ద్వారా ఇంటింటికీ తాగు నీటిని సరఫరా చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో గురువారం నాగ్ పూర్ లో తమ పార్టీ ఆఫీసును కూడా ప్రారంభించారు.

More Telugu News