Telangana: తెలంగాణను వరించిన ఐదు గ్రీన్​ యాపిల్ అవార్డులు

  • ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించి, సంరక్షించిన ఐదు ప్రముఖ నిర్మాణాలకు అవార్డులు ఇచ్చిన గ్రీన్‌ ఆర్గనైజేషన్‌ సంస్థ 
  • ప్రభుత్వం తరఫున లండన్ లో అవార్డులు అందుకున్న సీనియర్ ఐఏఎస్ అర్వింద్ కుమార్
  • అభినందించిన మంత్రి కేటీఆర్
Telangana govt receive the prestigious Green Apple awards at london

తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించి, సంరక్షించిన ఐదు ప్రముఖ నిర్మాణాలకు లండన్‌కు చెందిన ప్రతిష్ఠాత్మక గ్రీన్‌ ఆర్గనైజేషన్‌ సంస్థ గ్రీన్‌ యాపిల్‌ అవార్డులను ప్రకటించింది. మొజాంజాహీ మార్కెట్ పునరుద్ధరణ, నూతన స‌చివాల‌యం, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, పోలీసు క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్, యాద‌గిరిగుట్ట దేవాల‌యానికి గ్రీన్ యాపిల్ అవార్డులు వ‌చ్చాయి. లండ‌న్‌లో జరిగిన ప్రదానోత్సవంలో రాష్ట్ర ప్ర‌భుత్వం త‌రపున‌ పుర‌పాల‌క శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అర్వింద్‌కుమార్‌ గ్రీన్ యాపిల్ అవార్డుల‌ను అందుకున్నారు.

 ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యూటిఫుల్ బిల్లింగ్స్ క్యాట‌గిరీలో ఈ అవార్డులు తెలంగాణ కట్టడాలకు ల‌భించాయి. దేశంలోని నిర్మాణాలు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకోనుండడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇందులో ఒక్క తెలంగాణకే ఐదు విభాగాల్లో అవార్డులు రావడంతో తెలంగాణకు మరో ఘనత దక్కినట్టయింది. ప్రభుత్వం తరపున గ్రీన్‌ యాపిల్‌ అవార్డులు అందుకున్న అర్వింద్‌కుమార్‌ను మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అభినందించారు. తెలంగాణకు ఇది గర్వకారణమని అన్నారు.

More Telugu News