Mughals: విమర్శలతో వెనక్కి తగ్గిన కేంద్రం.. మొఘలుల పాఠాల తొలగింపు లేనట్టే!

  • పాఠ్యాంశాల తొలగింపుపై సర్వత్ర విమర్శలు
  • ఆ పాఠాలు యథాతథంగా కొనసాగుతాయని కమిటీ స్పష్టీకరణ
  • మొఘలుల, చోళుల చరిత్ర, అహోమ్, మరాఠా పాఠాలను కూడా బోధిస్తామన్న కమిటీ
Evolution and periodic table to stay part of Class 9 and10 syllabus

డార్విన్ సిద్ధాంతం, మొఘలుల పాఠ్యాంశాలను తొలగిస్తున్నట్టు ప్రకటించి విమర్శలు మూటగట్టుకున్న కేంద్రం ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గింది. 9,10 తరగతుల సిలబస్ నుంచి డార్విన్ పరిణామ సిద్ధాంతం, పీరియాడిక్ టేబుల్, మొఘలుల పాఠాలను తొలగించడం లేదని, అవి యథాతథంగా ఉంటాయని పాఠశాల విద్య జాతీయ కరికులం ప్రేమ్‌వర్క్ స్టీరింగ్ కమిటీ స్పష్టం చేసింది.

సాంఘిక శాస్త్రంలో మొఘలులు, చోళుల చరిత్ర, అహోమ్, మరాఠాల పాఠాలను బోధించనున్నట్టు తెలిపింది. ఓ భావజాలాన్ని వ్యాప్తిచేయడానికి పాఠ్యాంశాల హేతుబద్ధీకరణ ప్రక్రియను చేపట్టారన్న విమర్శలను తోసిపుచ్చింది. మునుపటి కరికులం ఓ ఎంజెండాను ప్రోత్సహించేలా ఉందని, ఎక్కువ కాలం పాలించిన చోళులు, అహోమ్‌ల చరిత్రను విస్మరించారని, కాబట్టి ఇప్పుడు ఇలాంటి వాటిని సవరిస్తున్నట్టు ఓ నిపుణుడు పేర్కొన్నారు.

More Telugu News