Revanth Reddy: తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఎంత శాతం ఓట్లు వస్తాయో చెప్పిన రేవంత్ రెడ్డి

Revanth Reddy reveals which party howmany seats will win in elections
  • బీఆర్ఎస్ కు 37, కాంగ్రెస్ కు 34, బీజేపీకి 14 శాతం ఓట్లు రావొచ్చునన్న రేవంత్
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు చెరో 45 సీట్లు, బీజేపీ, మజ్లిస్ లకు చెరో 7 సీట్లు వస్తాయని అంచనా
  • పదిహేను స్థానాల్లో గట్టి పోటీ ఉందన్న రేవంత్ 
  • బీజేపీ ఓటు బ్యాంకు తగ్గిందన్న కాంగ్రెస్ నేత
తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి, ఎంత శాతం ఓట్లు వస్తాయో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ శుక్రవారం మీడియాతో చిట్ చాట్ సందర్భంగా వెల్లడించారు. పార్టీల వారీగా ఇటీవల నిర్వహించిన సర్వే వివరాలు అంటూ ఆయన తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి 37 శాతం, కాంగ్రెస్ కు 34 శాతం, బీజేపీకి 14 శాతం ఓట్లు వస్తాయన్నారు. 

ఇక సీట్లపరంగా చూస్తే కనుక, బీఆర్ఎస్ కు 45 సీట్లు, కాంగ్రెస్ కు 45, బీజేపీకి 7, మజ్లిస్ పార్టీకి 7 సీట్లు వచ్చే అవకాశముందన్నారు. మరో పదిహేను స్థానాల్లో గట్టి పోటీ కనిపిస్తోందని వెల్లడించారు. గతంలో 24 శాతంగా ఉన్న బీజేపీ ఓటు బ్యాంకు ఇప్పుడు 14 శాతానికి పడిపోయిందన్నారు. ఎన్నికల నాటికి పరిస్థితిలో మరింత మార్పు వస్తుందన్నారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు.
Revanth Reddy
Congress

More Telugu News