Harish Rao: గుజరాత్‌తో పోలిస్తే తెలంగాణకు ప్రత్యేకంగా ఏమిచ్చారు?: హరీశ్ రావు

  • కేంద్రం సహకారంపై కిషన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్
  • అమిత్ షా అబద్దాలను రిపీట్ చేశారన్న హరీశ్ రావు
  • పన్నుల పంపిణీలో తెలంగాణ వాటా ప్రతి సంవత్సరం తగ్గుతూ వస్తోందన్న మంత్రి
Harish Rao questions Centre about GST funds

తెలంగాణ అభివృద్ధిలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ నిరంతర సహకారంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై మంత్రి హరీశ్ రావు స్పందించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పిన అబద్ధాలనే కిషన్ రెడ్డి రిపీట్ చేశారని మండిపడ్డారు. రాష్ట్రానికి ఇచ్చే రుణాలను కేంద్రం తన ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటన్నారు. పన్నుల పంపిణీలో తెలంగాణ వాటా ప్రతి సంవత్సరం తగ్గుతూ వస్తోందన్నారు.

మూడేళ్లలో జీఎస్టీ పరిహారం సెస్ గా రూ.34,737 కోట్లు వసూలు చేయగా, తెలంగాణకు ఇచ్చింది కేవలం రూ.8,927 కోట్లు మాత్రమే అన్నారు. జీఎస్టీ పరిహారం అన్నది కేంద్రం దయ కాదని, రాష్ట్రాల హక్కు అని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి రావాల్సింది రూ.1,35,812 కోట్లు కాగా, కేంద్రం ఈ మొత్తాన్ని ఎందుకివ్వలేదని నిలదీశారు. గుజరాత్ తో పోలిస్తే తెలంగాణకు ప్రత్యేకంగా ఏమిచ్చారో చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.

More Telugu News