Pawan Kalyan: ముందు నీ బాధ తీరుస్తా... సీఎం అవడం అనేది తర్వాత సంగతి: ఓ బాధితుడితో పవన్ కల్యాణ్

  • కాకినాడలో పవన్ కల్యాణ్ జనవాణి
  • ఓ దివ్యాంగుడి వెతలు విని చలించిన జనసేనాని
  • నువ్వు సీఎం కావాలన్నా అంటూ దివ్యాంగుడి ఆకాంక్ష
Pawan Kalyan receives grievances in Kakinada

జనసేనాని పవన్ కల్యాణ్ కాకినాడలో ఇవాళ జనవాణి నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ దివ్యాంగుడి వేదన విని చలించిపోయారు. పెన్షన్ అందడం లేదని, బతుకు దుర్భరంగా మారిందని వీల్ చెయిర్ లో ఉన్న ఆ దివ్యాంగుడు తెలిపాడు. ఆ దివ్యాంగుడి బాధలు విని కదిలిపోయిన పవన్ కల్యాణ్... అతడిని హత్తుకున్నారు. తప్పకుండా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా... ఆ దివ్యాంగుడు నువ్వు సీఎం కావాలన్నా అని తన మనసులో మాట బయటపెట్టాడు. అందుకు పవన్ స్పందిస్తూ... ముందు నీ బాధ తీరుస్తా... తర్వాత సంగతి తర్వాత అంటూ బదులిచ్చారు. అనంతరం అక్కడ్నించి నిష్క్రమించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.

More Telugu News