Kishan Reddy: అప్పులు తిరిగి చెల్లించాల్సిన రాష్ట్రాల్లో తెలంగాణ నెంబర్ వన్: కిషన్ రెడ్డి

  • రిపోర్ట్ టు పీపుల్ కార్యక్రమం చేపట్టిన బీజేపీ నేతలు
  • ప్రజలకు వివరాలు వెల్లడిస్తున్నామన్న కిషన్ రెడ్డి
  • తెలంగాణ వివరాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్
  • తెలంగాణ పట్ల కేంద్రానికి ఎలాంటి వివక్ష లేదని స్పష్టీకరణ
Kishan Reddy power point presentation in the part of Report To People initiative

రిపోర్ట్ టు పీపుల్ కార్యక్రమంలో భాగంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణకు సంబంధించి ఆసక్తికర అంశాలు వెల్లడించారు. నాబార్డ్ ద్వారా రుణాలు స్వీకరించిన రాష్ట్రాల్లో తెలంగాణ ఐదో స్థానంలో ఉందని, అప్పులు తిరిగి చెల్లించాల్సిన రాష్ట్రాల్లో తెలంగాణే నెంబర్ వన్ అని తెలిపారు. ఆర్ఈసీ తీసుకున్న రాష్ట్రాల్లోనూ తెలంగాణే అగ్రస్థానంలో ఉందని, పీఎఫ్ సీ ద్వారా రుణాలు అందుకున్న రాష్ట్రాల్లోనూ తెలంగాణ నెంబర్ వన్ అని వివరించారు. 

మోదీ ప్రభుత్వ తొమ్మిదేళ్ల పాలనపై ప్రజలకు బీజేపీ నేతలు రిపోర్ట్ టు పీపుల్ పేరిట వివరాలు నివేదిస్తున్నారు. ఇందులో భాగంగానే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. 

తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రానికి ఎలాంటి వివక్ష లేదని, ప్రధాని నరేంద్ర మోదీకి అన్ని రాష్ట్రాలు సమానమేనని స్పష్టం చేశారు. ఒక విధంగా. గుజరాత్ కంటే తెలంగాణకే ఎక్కువ నిధులు ఇచ్చారని వెల్లడించారు. మునుపటితో పోల్చితే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నుల శాతం పెరిగిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ప్రవేశపెట్టిన వందేభారత్ రైళ్లలో తెలంగాణకు రెండు రైళ్లు కేటాయించినట్టు తెలిపారు.

More Telugu News