venugopala krishna: సీఎం పదవి ఆశించలేదంటాడు.. ఇస్తే తీసుకుంటానంటాడు: పవన్ పై ఏపీ మంత్రి వేణుగోపాల కృష్ణ సెటైర్లు

minister venugopala krishna comments over pawan
  • పవన్‌ పూటకో వేషం వేస్తున్నారన్న వేణుగోపాల కృష్ణ
  • చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని విమర్శ
  • చిరంజీవి కష్టపడి సంపాదించిన ఇమేజ్‌ ఆయనకు లభించిందని వ్యాఖ్య
జనసేన చీఫ్ పవన్‌ కల్యాణ్‌పై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మండిపడ్డారు. పవన్‌ పూటకో వేషం వేస్తున్నారని, చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని విమర్శించారు. చంద్రబాబు వల్ల పుష్కరాల్లో 29 మంది చనిపోతే పవన్‌ ఒక్కసారైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. శనివారం మీడియాతో వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ.. పవన్‌ స్థిరత్వం లేని వ్యక్తి అని విమర్శించారు.

ముఖ్యమంత్రి పదవిని ఆశించలేదంటారని, తర్వాత ఇస్తే తీసుకుంటానంటారని ఎద్దేవా చేశారు. కుల ప్రస్తావన లేకుండా ఏ సభలోనూ మాట్లాడలేని వ్యక్తి పవన్‌ అని విమర్శించారు. చిరంజీవి కష్టపడి సంపాదించిన ఇమేజ్‌ ఆయనకు లభించిందని అన్నారు. ‘‘నువ్వు చేసిన తప్పదాల గురించి నీ మనస్సాక్షిని అడుగు. తప్పులు ఉంటే చెప్పాలి. కానీ చెప్పులు చూపించడం కాదు. నీ కార్యకర్తల మనోభావాలపై బండరాయి వేస్తున్నావు’’ అని అన్నారు.

‘‘పవన్‌.. పిఠాపురంలో నీవు మాట్లాడిన ధర్మ పరిరక్షణ వల్లించిన సూక్తులు ఏనాడైనా పాటించావా? ధర్మభక్షణ చేసే వ్యక్తి పక్కన నువ్వున్నావ్‌. నువ్వు సినిమాల్లో హీరో కావచ్చు. రాజకీయాల్లో జీరో అని ప్రజలకు అర్థమైంది’’ అని అన్నారు. ‘‘గోదావరి జిల్లాలో నీ సామాజిక వర్గానికి సమస్య వచ్చినప్పుడు నువ్వెక్కడున్నావ్‌. రైతులకు, మహిళలకు, చిన్నారులకు, విద్యార్థులకు, అనేక పథకాలు ప్రభుత్వం అందిస్తోంది. ఇవేవీ నీకు కనిపించడం లేదా?’’ అని మంత్రి వేణుగోపాల కృష్ణ నిలదీశారు. పవన్ చేస్తున్న ‘నారాహి’ యాత్రను ప్రజలు పట్టించుకోరని విమర్శించారు.
venugopala krishna
Pawan Kalyan
Chandrababu
YSRCP
Janasena
TDP
Chiranjeevi

More Telugu News