నల్ల బంగారం, తెల్ల బంగారం మన దగ్గరే ఉన్నాయి: కేటీఆర్
- తెలంగాణలో పండే తెల్ల పత్తి ఎక్కడా దొరకదన్న మంత్రి
- వరంగల్ లో యంగ్ వన్ కంపెనీ వస్త్ర పరిశ్రమకు శంకుస్థాపన
- వరంగల్ కు పూర్వ వైభవం తీసుకొస్తామని హామీ
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో నల్ల బంగారం (బొగ్గు) సమృద్ధిగా లభించే సింగరేణి ఉందన్నారు. అలాగే నాణ్యమైన తెల్ల బంగారం కూడా మన దగ్గరే లభిస్తుందన్నారు. వరంగల్ కు పూర్వ వైభవం కలిగే విధంగా కాకతీయ మెగా టెక్ట్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కొరియా దేశం నుంచి యంగ్ వన్ సంస్థ ముందుకు వచ్చి ఇక్కడ యూనిట్ స్థాపించిందన్నారు. మొత్తం 11 ఫ్యాక్టరీల ఏర్పాటుతో 20 వేల మందికి ఉపాధి కలుగుతుందన్నారు. 99 శాతం స్థానికులకు ఉపాధి అవకాశాలు ఉన్నాయని చెప్పారు.