Elon Musk: ఇద్దరు ప్రపంచ కుబేరులు.. పారిస్ లో లంచ్ మీట్!

  • ఫ్రాన్స్‌లో వివా టెక్నాలజీ సదస్సుకు హాజరైన బెర్నార్డ్ ఆర్నాల్ట్, ఎలాన్ మస్క్
  • పలువురు కుటుంబ సభ్యులతో కలిసి లంచ్
  • అత్యంత ధనవంతుల జాబితాలో తొలి రెండు స్థానాల్లో ఉన్న మస్క్, ఆర్నాల్ట్
worlds two richest people elon musk bernard arnault meet for lunch in paris

వారిద్దరూ అపర కుబేరులు.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు. ‘నంబర్ వన్’ స్థానం వారిద్దరి మధ్య దోబూచులాడుతుంటుంది. ఇద్దరి సంపదలో స్వల్ప తేడా.. భారీ పోటీ.. వారిద్దరూ ఎవరంటే ఫ్రెంచి వ్యాపారవేత్త, ఎల్‌వీఎంహెచ్‌ చైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్, టెస్లా అధినేత ఎలన్ మస్క్.. ఇప్పుడు వీరిద్దరూ ఒక్కచోట కలిశారు. తమ కుటుంబ సభ్యులతో పాటు ఫ్రాన్స్ లోని పారిస్ లో మీట్ అయ్యారు. ఇప్పుడీ వార్త ప్రపంచ వ్యాపార వర్గాల్లో ఓ సంచలనం. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. 

ఫ్రాన్స్‌లోని పెయిర్స్‌లో జరుగుతున్న వివా టెక్నాలజీ సదస్సు 7వ ఎడిషన్‌కు ఆర్నాల్ట్, మస్క్ హాజరయ్యారు. ఈ సందర‍్భంగా వీరు శుక్రవారం లంచ్ కోసం కలుసుకున్నారు. తల్లి మేయే మస్క్‌తో కలిసి మస్క్‌ హాజరు కాగా.. బెర్నార్డ్ ఆర్నాల్ట్ అతని ఇద్దరు కుమారులు ఆంటోయిన్, అలెగ్జాండ్రే ఆర్నాల్ట్‌తో వచ్చారు. మరోవైపు ‘‘కలిసి పని చేద్దాం!.. ఫ్రాన్స్ ను ఎంచుకోండి’’ అంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ కోరారు. మస్క్‌తో కలిసి ఉన్న ఫోటోను ఆయన ట్వీట్‌ చేశారు.

ఫోర్బ్స్ అంచనా ప్రకారం.. ఎలన్ మస్క్ ఆస్తుల విలువ 236.9 బిలియన్‌ డాలర్లు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా నంబర్ వన్ స్థానాన్ని ఇటీవల తిరిగి దక్కించుకున్నారు. బెర్నార్డ్ ఆర్నాల్ట్ కుటుంబం సంపద 233.4 బిలియన్‌ డాలర్లు. మొన్నటిదాకా తొలి స్థానంలో ఉన్న ఆర్నాల్ట్.. తన కంపెనీ షేర్లు పడిపోవడంతో రెండో స్థానంలోకి పడిపోయారు.

More Telugu News