2 కి.మీ. ఎత్తులో గంటకు 800 కి.మీ. వేగంతో విహరించడం గొప్ప అనుభూతినిచ్చింది: రాష్ట్రపతి ముర్ము
- ఏప్రిల్‌లో సుఖోయ్ యుద్ధ విమానంలో విహరించిన విషయాన్ని గుర్తు చేసుకున్న రాష్ట్రపతి
- దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో సీజీపీ పరేడ్‌కు హాజరైన ముర్ము
- క్యాడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించిన రాష్ట్రపతి
భారతీయ వైమానిక దళం అన్ని శాఖల్లోనూ మహిళా అధికారులను రిక్రూట్ చేయడం సంతోషకరమన్నారు. మహిళా ఫైటర్ పైలట్ల సంఖ్య భవిష్యత్తులో మరింత పెరగనున్నట్లు ఆమె వెల్లడించారు. ఏప్రిల్‌లో తాను సుఖోయ్ 30 ఎంకేఐ ఫైటర్ జెట్‌లో విహరించిన విషయాన్ని ఈ సందర్భంగా తెలిపారు. దాదాపు 30 నిమిషాల పాటు ఆ జెట్‌లో విహరించి బ్రహ్మపుత్రి, తేజ్‌పూర్ లోయలు, హిమాలయాల అద్భుతాలను వీక్షించానని చెప్పారు. సముద్ర మట్టానికి రెండు కిలోమీటర్ల ఎత్తులో గంటకు 800 కిలోమీటర్ల వేగంతో ఆకాశంలో విహరించడం తనకు గొప్ప అనుభూతిని మిగిల్చినట్లు ముర్ము తెలిపారు.