President Of India: హైదరాబాద్ కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

President reaches Hyderabad on friday
  • ఘన స్వాగతం పలికిన గవర్నర్ తమిళసై, సీఎం కేసీఆర్
  • నేడు రాజ్ భవన్ లో బస
  • రేపు దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో పరేడ్ కు హాజరు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భాగ్యనగరం చేరుకున్నారు. ఢిల్లీ నుండి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి తెలంగాణ గవర్నర్ తమిళసై, ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలికారు. వీరితో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్రమంత్రులు, డీజీపీ తదితరులు కూడా ఉన్నారు. రాష్ట్రపతికి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానించారు. ఈ రోజు రాత్రి రాజ్ భవన్ లో ఆమె బస చేస్తారు. శనివారం ఉదయం దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో జరగనున్న కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ కు హాజరవుతారు.
President Of India
draupdi murmu

More Telugu News