Coins: కర్నూలు జిల్లాలో ఇంటి కోసం పునాదులు తవ్వుతుంటే...!

British era coins found in Kurnool district
  • హోళగుంద మండలం ఎల్లార్తి గ్రామంలో ఘటన
  • కొత్త ఇంటిని నిర్మించుకుంటున్న శరణ బసప్ప అనే వ్యక్తి
  • పునాదుల్లో ఓ బిందె లభ్యం
  • బిందెలో బ్రిటీష్ కాలం నాటి నాణేలు
కర్నూలు జిల్లాలో ఓ ఇంటి కోసం పునాదులు తవ్వుతుంటే ఓ లోహపు పాత్ర బయటపడింది. అందులో పురాతన నాణేలు లభ్యమయ్యాయి. కర్నూలు జిల్లా హోళగుంద మండలం ఎల్లార్తి గ్రామంలో నివసించే శరణ బసప్ప కొత్త ఇంటిని నిర్మించుకునే ప్రయత్నంలో పునాదులు తవ్విస్తున్నాడు. కొంత లోతుగా తవ్విన తర్వాత ఓ చిన్న బిందె వంటి పాత్ర కనిపించింది.

దీనిపై సమాచారం అందుకున్న అధికారులు శరణ బసప్ప ఇంటి వద్దకు వచ్చి ఆ బిందెను స్వాధీనం చేసుకున్నారు. ఆ బిందెలో ఏం ఉన్నాయో అని అందరూ ఆసక్తిగా చూశారు. అందులో బ్రిటీష్ పాలన కాలం నాటి వెండి, రాగి నాణేలు కనిపించాయి. అవి 1897, 1900 సంవత్సరంలో ముద్రితమైన నాణేలు అని గుర్తించారు. వీటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Coins
British Era
Kurnool District
Andhra Pradesh

More Telugu News