Prabhas: 'ఆదిపురుష్' ఒక పెద్ద డిజప్పాయింట్ మెంట్: ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్

  • ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఆదిపురుష్' 
  • ఈ సినిమా ఒక పౌరాణిక నిరాశ అన్న తరణ్ ఆదర్శ్
  • 1.5 స్టార్ రేటింగ్ ఇచ్చిన బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్
Adipurush is a disappointment says Taran Adarsh

ప్రభాస్ తాజా చిత్రం 'ఆదిపురుష్' ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంపై డివైడ్ టాక్ వినిపిస్తోంది. సినిమా బాగుందని కొందరు రేటింగ్ ఇస్తుండగా... మరికొందరు పెదవి విరుస్తున్నారు. తాజగా, ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... ఈ చిత్రం ఒక పౌరాణిక నిరాశ (డిజప్పాయింట్ మెంట్) అని ఒక్క మాటలో తేల్చేశాడు. భారీ అంచనాలను ఈ సినిమా అందుకోలేకపోయిందని అన్నాడు. కలల తారాగణం, భారీ బడ్జెట్ ను చేతిలో ఉంచుకుని కూడా దర్శకుడు ఓం రౌత్ పెద్ద గందరగోళాన్ని సృష్టించాడని విమర్శించారు. ఓవరాల్ గా ఈ సినిమాకు 1.5 స్టార్ రేటింగ్ ఇచ్చాడు.  

More Telugu News