Oracle: ఒరాకిల్‌లో మరోసారి ఉద్యోగాల కోత, వందలాదిమందిపై ప్రభావం

  • ఒరాకిల్ హెల్త్ విభాగంలో లేఆఫ్‌లు
  • కొన్ని జాబ్ ఆఫర్లు కూడా వెనక్కి!
  • అమెరికా, ఐరోపాలలో కోతలు ఉండే ఛాన్స్ 
Oracle sacks hundreds of employees cancels job offers

టెక్ దిగ్గజం ఒరాకిల్ లో మరోసారి ఉద్యోగాల కోత విధించనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ దఫా ఈ సంస్థ హెల్త్ విభాగంలో లేఆఫ్‌లు ఉండనున్నాయి. ఇప్పటికే కొన్ని జాబ్ ఆఫర్లు కూడా వెనక్కి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఓపెనింగ్ పొజిషన్లను కూడా తగ్గించుకోనుంది. ఇటీవలే ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ సంస్థ సెర్నెర్ ను ఒరాకిల్ 28.3 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. అమెరికాలోని డిపార్టుమెంట్ ఆఫ్ వెటరన్స్ అఫైర్స్ ఆఫీస్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ లో పేషెంట్ల సమాచార నిర్వహణ కాంట్రాక్టును సెర్నర్ పొందింది. అయితే సెర్నెర్ సాప్ట్ వేర్ లో పలు సమస్యలు తలెత్తడంతో ఈ ఆఫీస్ భాగస్వామ్యాన్ని నిలిపివేసింది.

దీంతో ఒరాకిల్ హెల్త్ డిపార్టుమెంట్ లోని సెర్నెర్ లో లేఆఫ్ లు అమలు చేయవచ్చునని తెలుస్తోంది. ఈ లేఆఫ్ జాబితాలోని ఉద్యోగులకు మిగిలిన సర్వీసులకు సంబంధించి ప్రతి సంవత్సరం నాలుగు వారాల వేతనానికి మరో వారం అదనంగా చెల్లించడంతో పాటు సెలవులకు కూడా వేతనం ఇవ్వనున్నారు. అమెరికా, ఐరోపా కార్యాలయాల్లో ఈ కోతలు ఉండవచ్చునని తెలుస్తోంది. భారత్ కు సంబంధించి తెలియాల్సి ఉంది.

More Telugu News