Tirupati: తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం.. గోవిందరాజు స్వామి ఆలయ రథానికి తగులుతున్న సెగలు

Fire accident in Tirupati
  • తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం
  • ఫొటో ఫ్రేమ్స్ షాపులో చెలరేగిన మంటలు
  • మాడ వీధుల్లో రాకపోకల నిలిపివేత
తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నాలుగు అంతస్తుల బిల్డింగ్ లో మంటలు ఎగసిపడుతున్నాయి. బిల్డింగ్ లో ఉన్న ప్రఖ్యాత ఫొటో ఫ్రేమ్స్ షాపు లావణ్య ఫ్రేమ్స్ లో ప్రమాదం సంభవించింది. బిల్డింగ్ మొత్తంలో ఈ షాప్ ఉంటుంది. దేవుళ్లకు సంబంధించిన వేలాది ఫొటోలు ఈ షాప్ లో ఉంటాయి. మరోవైపు ఈ బిల్డింగ్ పక్కనే గోవిందరాజు స్వామి వారి ఆలయ రథం ఉంది. మంటల సెగ రథానికి తగులుతోంది. రథం మంటపం వరకు మంటలు వ్యాపించాయి. షాపు ముందున్న వాహనాలు తగలబడిపోతున్నాయి.

అగ్నిప్రమాదం నేపథ్యంలో మాడ వీధుల్లో రాకపోకలను నిలిపివేశారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. అగ్నిప్రమాదం నేపథ్యంలో భక్తులు భయాందోళనలకు గురవుతున్నారు.
Tirupati
Fire Accident
Govindaraju Swami
Ratham

More Telugu News