Uttar Pradesh: భర్త దారుణం.. ఒకే తూటాకు దంపతుల బలి.. అనాథలైన పిల్లలు

Husband shoots wife while hugging ends up killing himself
  • ఉత్తర్‌ప్రదేశ్ మొరాదాబాద్ జిల్లా ఖాన్‌పూర్ గ్రామంలో వెలుగు చూసిన ఘటన
  • ఫోన్ పోగొట్టిన భార్యతో భర్త తరచూ వాగ్వాదం
  • మంగళవారం దంపతుల మధ్య మళ్లీ ఘర్షణ
  • విచక్షణ కోల్పోయిన భర్త, భార్యను కౌగిలించుకుని వీపుపై నాటు తుపాకీతో కాల్పులు
  • తూటా తన శరీరంలోంచి కూడా దూసుకెళ్లడంతో భార్యతో పాటూ భర్త కూడా మృతి
  • అనాథలైన బిడ్డలను సంరక్షణాలయానికి తరలించిన పోలీసులు
భార్య ఫొన్ పోగొట్టినందుకు ఆమెపై కాల్పులు జరిపిన భర్త అదే తూటాకు తనూ బలయ్యాడు. చివరకు పిల్లలను అనాథలను చేశాడు. ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్ జిల్లా ఖాన్‌పూర్ గ్రామానికి చెందిన అనేక్ పాల్ రోజు కూలిగా పనిచేస్తుంటాడు. అతడికి భార్య సుమన్, నలుగురు పిల్లలు ఉన్నారు. కొన్ని రోజుల క్రితం భార్య ఫోన్ పొగొట్టడంతో దంపతుల మధ్య వివాదం మొదలైంది. ఇటీవల కాలంలో పలుమార్లు వారు ఈ విషయమై గొడవపడ్డారు. 

మంగళవారం కూడా ఇంట్లో పూజ చేసుకున్న అనంతరం భార్యాభర్తల మధ్య వాగ్వాదం తలెత్తింది. దీంతో, విచక్షణ కోల్పోయిన అనేక్ పాల్ భార్యను గట్టిగా కౌగిలించుకుని ఆమె వీపుపై నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. తూటా ఆమె ఛాతీలో నుంచి అనేక్ పాల్ శరీరంలోకి దూసుకెళ్లడంతో ఇద్దరూ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. కాల్పుల శబ్దం విని లోపలికొచ్చిన ఇరుగుపొరుగు వారు దంపతులను ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనాథలైన వారి పిల్లలను సంరక్షణాలయానికి తరలించారు.
Uttar Pradesh

More Telugu News