Biparjoy: గుజరాత్ తీరాన్ని తాకిన అత్యంత తీవ్ర తుపాను 'బిపోర్ జోయ్'

  • అరేబియా సముద్రంలో అత్యంత తీవ్ర తుపానుగా బలపడిన బిపోర్ జోయ్
  • పాకిస్థాన్ లోని కరాచీ, గుజరాత్ లోని మాండ్వీ మధ్య తీరం దాటుతోన్న తుపాను
  • తీరం దాటే ప్రక్రియ ఈ అర్ధరాత్రి వరకు కొనసాగుతుందన్న ఐఎండీ
Biparjoy makes landfall between Karachi and Mandvi

అరేబియా సముద్రంలో ఏర్పడిన అత్యంత తీవ్ర తుపాను బిపోర్ జోయ్ గుజరాత్ తీరాన్ని తాకింది. పాకిస్థాన్ లోని కరాచీ, గుజరాత్ కచ్ జిల్లాలోని మాండ్వీ మధ్య ఇది తీరాన్ని దాటుతోంది. అత్యంత తీవ్ర తుపానుగా బలపడిన బిపోర్ జోయ్ తుపాను పూర్తిగా భూభాగం పైకి చేరేందుకు ఈ అర్ధరాత్రి వరకు సమయం పడుతుందని ఐఎండీ వెల్లడించింది. 

ప్రస్తుతం ఈ తుపాను గంటకు 15 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. తుపాను ప్రభావంతో గుజరాత్ తీరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉద్ధృతంగా ఈదురుగాలులు వీస్తున్నాయి. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. 

తుపాను ప్రభావంతో గంటకు 150 కిమీ వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ పేర్కొంది. ఇప్పటికే తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి 94 వేల మందిని ఖాళీ చేయించారు. ప్రధాని నరేంద్ర మోదీ తుపాను పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఎక్కడికక్కడ ఎస్టీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పెద్ద సంఖ్యలో మోహరించారు.

More Telugu News