Avika Gor: నిర్మాతగానూ మారిన అవికా గోర్ ఏమైపోయినట్టు?

  • బాలనటిగా పేరు తెచ్చుకున్న అవికా గోర్ 
  • తొలి సినిమాతోనే దక్కిన భారీ సక్సెస్ 
  • కెరియర్ జోరుమీద ఉండగానే తీసుకున్న గ్యాప్ 
  • ఆ తరువాత నుంచి అంతగా లేని అవకాశాలు
Avika Gor Special

బుల్లితెర ద్వారా ఒక బాలనటి అనేక భాషల్లో అభిమానులను సంపాదించుకోవడం అవికా గోర్ విషయంలోనే జరిగి ఉంటుందేమో. ఆ సీరియల్ అలా కొనసాగుతూ ఉండగానే అవికా టీనేజ్ లోకి వచ్చేసింది. ఆ సమయంలోనే 'ఉయ్యాలా జంపాలా' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 

ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమెను వెతుక్కుంటూ వరుస ఆఫర్లు వచ్చాయి. ఇక ఆ తరువాత ఆమె చేసిన సినిమాల్లో 'సినిమా చూపిస్త మావా' కూడా పెద్ద హిట్ కొట్టింది. కెరియర్ జోరుమీద ఉండగానే, కొంత గ్యాప్ తీసుకుంది. ఆ తరువాత 'ఎక్కడికిపోతావు చిన్నవాడా'లోను కనిపించింది. 

ఆ మధ్య 'పాప్ కార్న్' సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి ఆమె కూడా ఒక నిర్మాణ  భాగస్వామిగా వ్యవహరించింది. అయితే ఈ సినిమా ఫలితం నిరాశ పరిచింది. ఆ తరువాత నుంచి ఎక్కడా అవికా పేరు కనిపించడం లేదు .. వినిపించడం లేదు. పోనీ మిగతా భాషల్లో బిజీగా ఉందా అంటే అలాంటి దాఖలాలు కూడా ఏమీ కనిపించడం లేదు. 

More Telugu News