Allu Arjun: అమీర్ పేటలో అల్లు అర్జున్ 'ఏఏఏ సినిమాస్' మల్టీప్లెక్స్.. మంత్రి తలసానితో కలిసి ప్రారంభించిన బన్నీ

Allu Arjun inaugurates his own multiplex along with minister Talasani Srinivas Yadav
  • హైదరాబాద్ అమీర్ పేట సత్యం థియేటర్ స్థానంలో మల్టీప్లెక్స్
  • ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో నిర్మించిన అల్లు అర్జున్
  • నేడు (జూన్ 15) ప్రారంభోత్సవం

హైదరాబాద్ లోని అమీర్ పేట సత్యం థియేటర్ స్థానంలో ఏషియన్ సినిమాస్ తో కలిసి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భారీ మల్టీప్లెక్స్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఏఏఏ సినిమాస్ పేరిట రూపుదిద్దుకున్న ఈ సినిమా థియేటర్ కాంప్లెక్స్ నేడు ప్రారంభమైంది. తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అల్లు అర్జున్ ఏఏఏ సినిమాస్ కు ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత, అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్, ఏషియన్ సినిమాస్ భాగస్వాములు కూడా పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News