Adipurush: ఆదిపురుష్ ఓటీటీ స్ట్రీమింగ్.. ఎక్కడ, ఎప్పుడంటే..!

  • ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన చిత్రంపై భారీ అంచనాలు
  • 16న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న చిత్రం
  • ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్
Adipurush will premiere on OTT platform only after 8 weeks of its theatrical releas

ప్యాన్ ఇండియా హీరో, మన రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘ఆదిపురుష్’ సినిమా కోసం భారత చలన చిత్ర పరిశ్రమ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ నెల 16న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. రామాయణం ఇతివృత్తంగా దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్‌ తో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా వేలాది థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

 ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటించగా..సీతగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ కనిపించనుంది. విలన్‌గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటించారు. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ భారీ రేటుకు సొంతం చేసుకుంది. సినిమా థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత ఆదిపురుష్ అమెజాన్ లో స్ట్రీమ్ అవుతుందని తెలుస్తోంది. ఈ లెక్కన ఆదిపురుష్ ను ఓటీటీలో చూడాలంటే రెండు నెలలు వేచి ఉండాల్సిందే.

More Telugu News