Saitej: 'గోలీ శంకర్'గా మెగా మేనల్లుడు!

Goli Shankar Movie Update
  • 'విరూపాక్ష'తో హిట్ కొట్టిన సాయితేజ్ 
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న 'బ్రో'
  • సంపత్ నందికి గ్రీన్ సిగ్నల్ 
  • మాస్ యాక్షన్ ఎంటర్టయినర్ జోనర్లో సాగే కథ
'విరూపాక్ష' హిట్ తో సాయితేజ్ ఇప్పుడు మంచి ఉత్సాహంతో ఉన్నాడు. తన తాజా చిత్రంగా 'బ్రో' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ కీలకమైన పాత్రను పోషిస్తూ ఉండటంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక సంపత్ నంది దర్శకత్వంలోను సాయితేజ్ ఒక సినిమా చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. 

'రచ్చ' .. 'బెంగాల్ టైగర్' సినిమాలు చూస్తే, మాస్ ఆడియన్స్ కి ఏం కావాలనేది సంపత్ నందికి బాగా తెలుసనే విషయం అర్థమవుతుంది. అయితే ఈ మధ్య కాలంలో ఆయనకి హిట్ పడలేదు. గోపీచంద్ హీరోగా వెంటవెంటనే రెండు సినిమాలు చేసినా, ఫలితంలో ఎలాంటి మార్పు రాలేదు. దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే ఒక పట్టుదలతో ఆయన ఉన్నాడు. 

ఆయన వినిపించిన కథ నచ్చడంతో సాయితేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు. ఈ సినిమాకి 'గోలీ శంకర్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. దాదాపు అదే టైటిల్ ను ఖాయం చేసే అవకాశాలు ఉన్నాయట. ఈ సినిమాలో మాస్ అంశాలు పుష్కలంగా ఉంటాయనే విషయం టైటిల్ ను బట్టే అర్థమవుతోంది. 

Saitej
Sampath Nandi
Goli Shankar Movie

More Telugu News