Jagan: ఆ మెడికల్ కాలేజీలు చరిత్రలో నిలిచిపోయే నిర్మాణాలు: సీఎం జగన్

  • రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ సమీక్ష
  • కొత్త మెడికల్ కాలేజీల పనులపై అధికారులకు దిశానిర్దేశం
  • మౌలిక సదుపాయాలకు లోటు ఉండరాదని స్పష్టీకరణ
CM Jagan reviews state medical and health dept

ఏపీ సీఎం జగన్ ఇవాళ రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీల అంశంపై అధికారులతో చర్చించారు. ఈ విద్యాసంవత్సరంలో ప్రారంభం కానున్న మెడికల్ కాలేజీల్లో మౌలిక సదుపాయాలకు లోటు ఉండకూడదని అధికారులకు స్పష్టం చేశారు. 

ఈ నూతన మెడికల్ కాలేజీలు చరిత్రలో నిలిచిపోయే నిర్మాణాలని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఏలూరు, నంద్యాల, మచిలీపట్నం, విజయనగరం, రాజమండ్రిలో నెలకొల్పిన వైద్య కళశాలల్లో ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభం అవుతాయని సీఎం జగన్ వెల్లడించారు. పులివెందుల, ఆదోని, పాడేరు వైద్య కళాశాలల పనులను కూడా వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కళాశాల్లో వచ్చే ఏడాది నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని అధికారులు సీఎం జగన్ కు తెలిపారు.

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖపైనా సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ వైద్య విధానంపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

  • ఒక కుటుంబంలో పుట్టే బిడ్డ దగ్గర్నుంచి ప్రతి ఒక్కరికీ ఆరోగ్య శ్రీ కార్డు ఇవ్వాలి 
  • క్యూఆర్ కోడ్ ఉన్న ఈ కార్డు ద్వారా వారి ఆరోగ్య వివరాలను నమోదు చేయాలి 
  • ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవినీతికి తావుండకూడదు. ఫిర్యాదు చేయడానికి ప్రతి చోటా టెలిఫోన్ నెంబర్ అందుబాటులో ఉంచాలి
  • ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టును ప్రభావవంతంగా అమలు చేయాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్ ల పనితీరు ఇందులో కీలకం 
  • ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టుతో 1.39 కోట్ల మందికి వైద్య సేవలు అందించాం. 
  • వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీలను ఎప్పటికప్పుడు గుర్తించి భర్తీ చేయాలి. ఓ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ఈ ప్రక్రియ జరగాలి 
  • 4 వారాలకు మించి ఎక్కడా ఖాళీలు ఉండకూడదు. సిబ్బంది కొరత ఉంటే 4 వారాల్లోపే భర్తీ చేయాలి  
  • గ్రామ స్థాయిలో క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయాలి 
  • సికిల్ సెల్ ఎనీమియా నివారణ కార్యక్రమంపై తగిన చర్యలు తీసుకోవాలి 


More Telugu News