Nara Lokesh: లోకేశ్ కు వీడ్కోలు పలికిన రాయలసీమ టీడీపీ నేతలు... నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించిన యువగళం

Lokesh Yuvagalam Padayatra enters Nellore district
  • రాయలసీమలో ముగిసిన యువగళం
  • ఆత్మకూరు నియోజకవర్గంలో కాలుమోపిన లోకేశ్
  • ఉమ్మడి నెల్లూరులో ఘనస్వాగతం పలికిన టీడీపీ నేతలు
టీడీపీ అగ్రనేత లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర రాయలసీమలో ముగిసింది. లోకేశ్ కు రాయలసీమ టీడీపీ నేతలు వీడ్కోలు పలికారు. బద్వేలు నియోజకవర్గంలో రాయలసీమ నేలకు నమస్కరించిన లోకేశ్ భావోద్వేగానికి లోనయ్యారు. సీమలో పాదయాత్రకు బ్రహ్మరథం పట్టిన ప్రజలు, సహకరించిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు అంటూ లోకేశ్ వీడ్కోలు ప్రసంగం చేశారు. 

అనంతరం ఆత్మకూరు నియోజకవర్గంలోకి లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రవేశించింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో లోకేశ్ కు టీడీపీ నేతలు ఘనస్వాగతం పలికారు. 

బీద రవిచంద్ర యాదవ్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి,  ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం వెంకట రమణరెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, ఆనం రంగమయూర్ రెడ్డి, బొల్లినేని వెంకటరామారావు, కంభం విజయరామిరెడ్డి, కురుగోండ్ల రామకృష్ణ, కొమ్మి లక్ష్మయ్య నాయుడు, తాళ్లపాక రమేష్ రెడ్డి, కాకర్ల సురేష్, పనబాక కృష్ణయ్య, కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి, మాలేపాటి సుబ్బనాయుడు, తాళ్లపాక అనురాధ తదితర నేతలు, కార్యకర్తలు లోకేశ్ ను జిల్లాలోకి స్వాగతించారు.

   

 
Nara Lokesh
Yuva Galam Padayatra
Nellore District
Rayalaseema
TDP
Andhra Pradesh

More Telugu News