Nara Lokesh: 57 మందీ రండి... నేనొక్కడినే వస్తా: రాయలసీమ వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు లోకేశ్ ఛాలెంజ్

  • రాయలసీమలో ముగిసిన లోకేశ్ యువగళం
  • బద్వేలులో భావోద్వేగాలకు లోనైన టీడీపీ యువనేత
  • సీమను అభివృద్ధి చేసింది టీడీపీయేనని ఉద్ఘాటన
  • దమ్ముంటే చర్చకు రావాలని 49 మంది వైసీపీ ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలకు సవాల్
Lokesh challenges Rayalaseema YCP MLAs and MPs

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర రాయలసీమలో ముగిసింది. ఈ సందర్భంగా రాయలసీమ వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఆయన సవాల్ విసిరారు. రాయలసీమలో ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో చర్చిద్దాం రండి అని చాలెంజ్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు 49 మంది, ఎంపీలు 8 మంది... మీరు 57 మందీ రండి... నేనొక్కడినే వస్తా... చర్చకు మేం సిద్ధం అని సవాల్ విసిరారు. 

బద్వేలు క్యాంప్ సైట్ ముందు, టీడీపీ హయాంలో పూర్తి చేసిన ప్రాజెక్టులు, సీమకు వచ్చిన కంపెనీల లిస్ట్ ప్రదర్శిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల ముందు లోకేశ్ సెల్ఫీలు దిగారు. మిషన్ రాయలసీమ కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన హామీలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల ముందు కూడా లోకేశ్ సెల్ఫీ దిగారు. లోకేశ్ ఈ సెల్ఫీలతో వైసీపీ ప్రజాప్రతినిధులను ఛాలెంజ్ చేశారు. 

"మేము చేసింది ఏంటో చూపించాను. మీరు చేసింది ఏంటో చెప్పే దమ్ము ఉందా? నాలుగేళ్లలో జగన్, వైసీపీకి చెందిన 49 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు సీమకు చేసింది ఏమీ లేదు. ఒక్క ప్రాజెక్టు పూర్తి చెయ్యలేదు, ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు. గతంలో సీమని అభివృద్ధి చేసింది మేమే. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మిషన్ రాయలసీమలో భాగంగా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటాం" అని లోకేశ్ స్పష్టం చేశారు.

More Telugu News