Rahul Gandhi: వాషింగ్టన్‌ టు న్యూయార్క్‌.. అమెరికాలోనూ రాహుల్ ట్రక్ రైడ్.. ఇదిగో వీడియో!

Rahul Gandhi enjoys truck ride from Washington to New York
  • అమెరికాలో తల్జిందర్ సింగ్‌ అనే డ్రైవర్‌తో కలిసి ట్రక్కులో ప్రయాణించిన రాహుల్
  • వీడియోను తన యూట్యూబ్‌ చానల్‌లో పోస్ట్ చేసిన కాంగ్రెస్ నేత
  • గత నెలలో కూడా ఢిల్లీ నుంచి చండీగఢ్‌ వెళ్తూ లారీ సవారీ
కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మరోసారి ట్రక్ రైడ్ కు వెళ్లారు. అయితే ఈసారి మాత్రం అమెరికాలో ప్రయాణించారు. వాషింగ్టన్‌ నుంచి న్యూయార్క్‌ దాకా తల్జిందర్ సింగ్‌ అనే డ్రైవర్‌తో కలిసి ట్రక్కులో ట్రావెల్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను రాహుల్ తన యూట్యూబ్‌ చానల్‌లో పోస్టు చేశారు.

ట్రక్కు డ్రైవర్లు ఎలా పని చేస్తారు? ట్రక్కు ఫీచర్లు ఏమిటి? వారికి చలాన్లు పడతాయా? వేగ పరిమితి ఎంత? డ్రైవర్లు ఎంత ఆదాయం సంపాదిస్తారు? వంటి విషయాలను తన ప్రయాణంలో రాహుల్ అడిగి తెలుసుకున్నారు. అక్కడ డ్రైవర్లు నెలకు రూ.8 లక్షల దాకా సంపాదిస్తారని తెలిసి ఆయన ఆశ్చర్యపోయారు.

తర్వాత డ్రైవర్‌ తల్జిందర్‌ ‘ఏదైనా పాట వినిపించనా’ అని అడిగినప్పుడు.. ‘ఏదైనా సరే’ అని రాహుల్‌ పేర్కొన్నారు. దీంతో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన సిద్ధూ మూసేవాలా పాట పెట్టమంటారా? అని అడగ్గా.. ‘295’ సాంగ్‌ను ప్లే చేయమని రాహుల్ కోరారు. ట్రక్కును ఓ రెస్టారెంట్‌ వద్ద ఆపారు. రాహుల్‌ రెస్టారెంట్ లోకి వెళ్లి వారిని పలకరించారు. అందరితో కలిసి ఫొటోలు దిగారు. కొంచెం ఆహారం తిని ట్రక్కు డ్రైవర్‌కు వీడ్కోలు పలికారు.

ఈ వీడియోను 2.25 లక్షల మందికి పైగా వీక్షించగా.. 36 వేల మంది లైక్‌ చేశారు. మరోవైపు గత నెలలో ఢిల్లీ నుంచి చండీగఢ్‌ వెళ్తూ మార్గమధ్యంలో కారు దిగిన రాహుల్.. ఓ లారీ ఎక్కి ప్రయాణించారు. లారీలో డ్రైవర్‌ పక్కన కూర్చోవడం, ఓ దాబా వద్ద డ్రైవర్లతో మాట్లాడటం తదితర దృశ్యాలను కాంగ్రెస్‌ పార్టీ ట్విట్టర్‌ లో షేర్ చేసింది.

Rahul Gandhi
truck ride
Washington to New York
Congress
USA

More Telugu News