Pawan Kalyan: పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు లైన్ క్లియర్.. జిల్లా ఎస్పీ కీలక ప్రకటన

Police gives permission to Pawa Kalyan Varahi yatra
  • వారాహి యాత్రకు ఇబ్బంది లేదన్న కాకినాడ ఎస్పీ
  • జనసేన నేతలతో డీఎస్పీలు టచ్ లో ఉన్నారని వెల్లడి
  • ఎవరికైనా ఎక్కడైనా పర్యటించే హక్కు ఉందని వ్యాఖ్య
రేపటి నుంచి జనసేనాని పవన్ కల్యాణ్ చేపట్టనున్న వారాహి యాత్రకు లైన్ క్లియర్ అయింది. వారాహి యాత్రకు పోలీసులు అనుమతిని మంజూరు చేశారు. కాకినాడ ఎస్పీ సతీశ్ మాట్లాడుతూ, వారాహి యాత్రకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. జనసేన నేతలతో డీఎస్పీలు టచ్ లో ఉన్నారని వెల్లడించారు. ఎవరికైనా ఎక్కడైనా పర్యటించే హక్కు ఉందని అన్నారు. అయితే భద్రతాపరమైన అంశాల నేపథ్యంలో వారాహి యాత్ర మినిట్ టు మినిట్ షెడ్యూల్ ఇవ్వాలని అడిగినట్టు చెప్పారు. వారాహి యాత్రకు అనుమతులు లభించడంతో జనసైనికులు ఆనందంలో మునిగిపోయారు. 

మరోవైపు, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉందని పోలీసులు ప్రకటించడంతో జనసేన పార్టీ నేతలు ఆందోళనకు గురయ్యారు. వారాహి యాత్రను అడ్డుకోవడానికే పోలీస్ యాక్ట్ 30ని తీసుకొచ్చారని వారు విమర్శించారు. అవసరమైతే అనుమతి కోసం హైకోర్టుకు వెళ్లాలని కూడా భావించారు. ఈలోగానే యాత్రకు అనుమతి ఇస్తున్నట్టు జిల్లా ఎస్పీ ప్రకటించడంతో ఉత్కంఠకు తెరపడింది.

జనసేన విడుదల చేసిన వారాహి యాత్ర షెడ్యూల్:
Pawan Kalyan
Varahi Yatra
Jana Reddy
Police Permission

More Telugu News