Chiranjeevi: ఎనిమిదిమంది కథానాయికలతో చిరూ సోషియో ఫాంటసీ చిత్రం?

Chiranjeevi in Vasishta Movie
  • 'బింబిసార' సినిమాతో హిట్ కొట్టిన వశిష్ఠ
  • సోషియో ఫాంటసీ లైన్ తో మెగాస్టార్ ను మెప్పించిన దర్శకుడు
  • వర్కింగ్ టైటిల్ గా వినిపిస్తున్న 'ముల్లోక వీరుడు'
  • 'భోళాశంకర్' రిలీజ్ తరువాత రానున్న క్లారిటీ
చిరంజీవి కథానాయకుడిగా చాలాకాలం క్రితం వచ్చిన 'జగదేకవీరుడు అతిలోక సుందరి' సినిమాను ఇంతవరకూ ప్రేక్షకులు మరిచిపోలేదు. తెలుగులో వచ్చిన సోషియో ఫాంటసీ సినిమాలలో ఇది ముందువరుసలో కనిపిస్తుంది. కథాకథనాలు .. పాటలు .. చిత్రీకరణ ఇలా అన్నింటిలో ఈ సినిమా తన ప్రత్యేకతను చాటుకుంది. 

ఇప్పుడు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నప్పటికీ, ఈ తరహా కథలను చేయడానికి హీరోలు వెనకాడుతున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవినే మరోసారి సోషియో ఫాంటసీ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుందనే వార్త ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. 

'బింబిసార' సినిమాతో దర్శకుడిగా తానేమిటనేది నిరూపించుకున్న వశిష్ఠ, సోషియో ఫాంటసీ లైన్ చెప్పి మెగాస్టార్ ను ఒప్పించాడని అంటున్నారు. ఈ సినిమాలో ఎనిమిదిమంది కథానాయికలు కనిపించనున్నారని చెబుతున్నారు. వర్కింగ్ టైటిల్ గా 'ముల్లోక వీరుడు'ను సెట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. 'భోళాశంకర్' రిలీజ్ తరువాత ఈ ప్రాజెక్టు పై క్లారిటీ రానుందని అంటున్నారు. 

Chiranjeevi
Vashishta
Mulloka Veerudu Movie

More Telugu News