Balakrishna: భారీ రేటుకు 'భగవంత్ కేసరి' స్ట్రీమింగ్ రైట్స్?

  • 'భగవంత్ కేసరి'గా బాలకృష్ణ 
  • టీజర్ తో పెరిగిన అంచనాలు 
  • అమెజాన్ ప్రైమ్ కి స్ట్రీమింగ్ హక్కులంటూ టాక్ 
  • అధికారిక ప్రకటనతోనే రావలసిన స్పష్టత
Bhagavanth Kesari Movie Update

బాలకృష్ణ కథానాయకుడిగా 'భగవంత్ కేసరి' సినిమా రూపొందుతోంది. సాహు గారపాటి - హరీశ్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమా బాలయ్య మార్క్ యాక్షన్ తో ఉంటుందని దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పాడు. అది నిజమేననే విషయం టైటిల్ ఎనౌన్స్ మెంట్ తోనే తేలిపోయింది. 

ఈ సినిమా టైటిల్ పరంగా .. బాలయ్య లుక్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. టీజర్ లో వదిలిన డైలాగ్ తోనే బాలయ్య పాత్ర ఎంత పవర్ఫుల్ గా ఉంటుందనేది అర్థమైపోతోంది. ఈ సినిమాను దసరాకి భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఆ దిశగానే ఈ సినిమాకి సంబంధించిన పనులు జరుగుతున్నాయి.

విడుదలకి ముందే ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు దక్కించుకోవడానికి ఓటీటీ సంస్థలు గట్టిగానే పోటీ పడ్డాయట. చివరికి అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. 18 కోట్లకు డీల్ కుదిరినట్టుగా టాక్ నడుస్తోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావలసి ఉంది. కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, బాలయ్య కూతురుగా శ్రీలీల కనిపించనుందనే సంగతి తెలిసిందే. 

More Telugu News