మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూత

  • అనారోగ్య సమస్యలతో ఇటీవల ఆసుపత్రిలో చేరిన మాజీ ఎమ్మెల్యే
  • చికిత్స పొందుతూ మంగళవారం మృతి
  • దయాకర్ రెడ్డి మృతిపై సీఎం కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం
మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు. దయాకర్ మరణంపై సీఎం కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు, ఇతర తెలంగాణ నేతలు, ప్రముఖులు సంతాపాన్ని తెలిపారు. 

దయాకర్‌రెడ్డి మూడుసార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. అమరచింత నియోజకవర్గానికి రెండు సార్లు, మక్తల్ నియోజకవర్గానికి ఒకసారి ప్రాతినిధ్యం వహించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగానూ పనిచేశారు. ఆయన స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లాలోని పర్కపురం.


More Telugu News